Lenin: లెనిన్ రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akhil) టాలీవుడ్లోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతున్నా అతనికి చెప్పుకోదగ్గ హిట్ మాత్రం ఒక్కటీ పడలేదు. కెరీర్లో సాలిడ్ హిట్ కొట్టి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అఖిల్ అందులో భాగంగానే ఏజెంట్(Agent) అనే మూవీ చేశాడు. కానీ ఆ సినిమా డిజిస్టర్ గా నిలవడంతో కాస్త గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీ లెనిన్ తో బిజీగా ఉన్నాడు.
కాగా రీసెంట్ గా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అఖిల్, ఇప్పుడు మళ్లీ తన అప్‌కమింగ్ ప్రాజెక్టు లెనిన్ పై ఫోకస్ చేశాడు. ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎంతో ఎదురుచూస్తుండగా, తాజాగా లెనిన్(Lenin) మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం లెనిన్ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తైందని తెలుస్తోంది. మరో 20% షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని అది కూడా పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కంప్లీట్ చేసి నవంబర్ 17న లెనిన్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.