Peddi: పెద్ది మూవీపై లేటెస్ట్ అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా ఉప్పెన(uppena) డైరెక్టర్ బుచ్చి బాబు సాన(buchi babu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది(peddi). పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR rahman) పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి రీసెంట్ గా చికిరి(chikiri) అనే ఫస్ట్ సింగిల్ రిలీజైంది.
చికిరి సాంగ్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ లో రెహమాన్ కంపోజింగ్, ట్యూన్ తో పాటూ చరణ్ వేసిన స్టెప్పులు సాంగ్ ను మళ్లీ మళ్లీ వినేలా చేస్తున్నాయి. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master) కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ చరణ్ తో వేయించిన స్టెప్పులకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పెద్ది మూవీలో మరో సాంగ్ కు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ది టీమ్ గత కొన్ని రోజులుగా ఓ పాట షూటింగ్ లో బిజీగా ఉండగా, నిన్నటితో ఆ పాట పూర్తైనట్టు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చేసిన ఈ సాంగ్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల్లోనే షూట్ చేశారట. ఇప్పటికే చికిరి సాంగ్ ను కంపోజ్ చేసి ఆ సాంగ్ లో చరణ్ తో మంచి స్టెప్పులేయించిన జానీ ఈసారి పాటలో మెగా పవర్ స్టార్ తో ఎలాంటి స్టెప్పులేయించాడో చూడ్డానికి ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.






