Akhanda2: అఖండ2 ఆడియోపై లేటెస్ట్ బజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ2(akhanda2). బ్లాక్ బస్టర్ మూవీ అఖండ(akhanda)కు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బోయపాటి- బాలయ్యది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవడంతో పాటూ అఖండ కు సీక్వెల్ గా తెరకెక్కుతుండటంతో మొదటి నుంచి ఈ మూవీపై మంచి హైప్ నెలకొంది.
ఆ హైప్ కు ఏ మాత్రం తీసిపోకుండా అఖండ2ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి శ్రీను. పాన్ ఇండియా స్థాయిలో డివోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం ఖాయమని మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండగా, అఖండకు సంగీతం అందించిన తమన్(thaman), ఈ సీక్వెల్ కు కూడా మ్యూజిక్ ను అందిస్తున్నాడు. గతంలో అఖండకు తమన్ స్పీకర్లు పగిలిపోయే మ్యూజిక్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుంది.
ఇప్పుడు ఈ సినిమాకు అఖండను మించేలా మ్యూజిక్ ఇవ్వాలని చూస్తున్నాడట తమన్. ఇదిలా ఉంటే అఖండ2 ఆడియోకు సంబంధించి ఇప్పుడో న్యూస్ వినిపిస్తోంది. అఖండ2 ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్(Aditya Music) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ కూడా రానుంది. అఖండ సినిమాకు ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్ ఈసారి అఖండ2ను ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.