కృతి ఆశలన్నీ దానిపైనే ..!
18 ఏళ్ల వయసులో ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కృతి శెట్టికి మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఉప్పెన మంచి హిట్ అవడంతో కృతికి ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో కృతి కూడా ఒకటిగా ఉంది. కానీ ఏడాది లోపు మొత్తం కృతి కెరీరే మారిపోయింది.
తను నటించిన సినిమాలు ఫ్లాపులవడంతో అమ్మడికి ఆఫర్లు రావడం ఆగిపోయాయి. నాగచైతన్యతో నటించిన కస్టడీ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ అది కూడా డిజాస్టర్ కావడంతో ఇక కృతికి చాన్సులు రాలేదు. ఒకటి రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నప్పటికీ అవేమీ ఫైనల్ కాలేదు. తెలుగులో ఛాన్సులు రాకపోవడంతో ఇక తన ఆశలన్నీ తమిళ ఇండస్ట్రీపైనే పెట్టుకుంది.
మొన్నా మధ్య సూర్యతో బాల డైరెక్షన్లో నటించే ఛాన్సొచ్చిందన్నారు కానీ అదీ చేజారింది. దాని తర్వాత మొత్తానికి కార్తీతో నటించే అవకాశం చేజిక్కించుకుంది కృతి. కార్తి హీరోగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కృతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా సినిమా మంచి హిట్ అవుతుందని తమిళ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం కృతి తమిళంలో ఛాన్సులు అందుకునే అవకాశాలెక్కువ. ప్రస్తుతం కృతి ఆశలన్నీ కార్తి సినిమాపైనే ఉన్నాయి.













