Nithin: నితిన్ కథతో ఆ యంగ్ హీరో సినిమా?

సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరి చేతిలోకి వెళ్లడం చాలా కామన్. ఇప్పుడు అలానే ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయబోతున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(nithin) గతంలో పవర్ పేట(Power peta) అనే సినిమాను చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. కృష్ణ చైతన్య(krishna chaitanya) దర్శకత్వంలో ఈ సినిమా చేసేందుకు నితిన్ రెడీ అయ్యాడు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People media factory) ఆ సినిమాను నిర్మించాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పక్కకెళ్లిపోయింది. ఆ తర్వాతే కృష్ణ చైతన్య విశ్వక్సేన్(Viswaksen) తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari) చేశాడు. అయితే అప్పుడు హోల్డ్ లో పడిన పవర్ పేట ఇప్పుడు తిరిగి పట్టాలెక్కడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
కాకపోతే ఈసారి నితిన్ తో కాదట. అదే సినిమాను కృష్ణ చైతన్య, సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా చేయడానికి రెడీ అవుతున్నాడట. నితిన్ కు చెప్పిన కథలో కొన్ని మార్పులు చేసిన కృష్ణ చైతన్య దాన్ని సందీప్ తో చేయాలని భావిస్తున్నాడట. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్(70MM Entertainments) బ్యానర్ లో విజయ్ చిల్లా(Vijay Chilla), శశి దేవిరెడ్డి(Sasi Devi Reddy) ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఆగస్ట్ 9న పవర్ పేట మొదలవబోతున్నట్టు తెలుస్తోంది.