ఆ విషయంలో ఒత్తిడికి లోనవుతున్న కొరటాల
ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు. చివరకి వారికి ఇష్టం లేకపోయినా ఆ సినిమా అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ సారైనా కచ్ఛితంగా చెప్పిన టైమ్ కే వస్తుందన్న గ్యారెంటీ లేదు. ముందుకు రావొచ్చు, వెనక్కూ వెళ్లొచ్చు. గత రెండు మూడేళ్లుగా ఏ ప్యాన్ ఇండియా సినిమా కూడా చెప్పిన డేట్ కు రిలీజ్ కావడం లేదు.
దేవర విషయంలో కొరటాల శివ ఎంతో పకడ్భందీగా షూటింగ్ ప్లాన్ చేసుకుని, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూసుకుంటున్నప్పటికీ పాటల విషయంలో మాత్రం ఆయన అనుకున్న స్పీడు అందుకోలేకపోయాడు. దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. రీసెంట్ గా ఈ విషయాన్ని హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా చెప్పింది. కొంత భాగం షూటింగ్ తో పాటూ కొన్ని పాటలు పెండింగ్ ఉన్నాయని, అవి పూర్తి అయితే దేవర కంప్లీట్ అవుతుందని చెప్పింది.
అయితే ఇక్కడ సమస్య మొత్తం అనిరుధ్ వల్లే. ఆయన నుంచి బెస్ట్ ట్యూన్స్ ను కొరటాల రాబట్టుకోవాల్సి ఉంది. తమిళ డైరెక్టర్లు మన డైరెక్టర్లలా కాదు ఇచ్చిన ట్యూన్స్ కు వెంటనే ఓకే చెప్తారు. కానీ మన వాళ్లకు ఒక్కో సాంగ్ కు రెండు మూడు ఆప్షన్స్ కావాలి. వాటిలో హీరోతో డిస్కస్ చేసి మంచి సాంగ్ ను ఫైనల్ చేస్తారు. ఇప్పుడు అనిరుధ్ కు ఒక్క సినిమా కోసం అన్ని ట్యూన్స్ చేసేంత తీరిక లేదు. అందుకే ఈ విషయంలో కొరటాల ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొరటాల అనిరుధ్ నుంచి ఎలాంటి ట్యూన్స్ ను రాబట్టుకుంటాడో చూడాలి.













