Kona Venkat: బకారా కామెడీ మానుకోడా అన్నారు
ఢీ(Dhee), రెడీ(Ready), దూకుడు(Dookudu), అదుర్స్(Adhurs) సినిమాలకు రైటర్ గా పని చేసిన కోన వెంకట్(Kona Venkat) ఆ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుని అప్పట్లో టాలీవుడ్లోని స్టార్ రైటర్ గా ఓ వెలుగు వెలిగాడు. కానీ గత కొంతకాలంగా కోన వెంకట్ నుంచి ఆడియన్స్ ను మెప్పించే కథ ఒక్కటీ రాలేదు. ఇదిలా ఉంటే రీసెంట్ గా కోన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నాడు.
ఢీ సినిమా తర్వాత తాను ఒకే ఫార్ములాతో చాలా సినిమాలు చేశానని, ఆ సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయని, కానీ ఆ టైమ్ లో ఈ విషయంలో తనపై ఆడియన్స్ తో పాటూ పలువురు క్రిటిక్స్ తీవ్ర విమర్శలు చేశారని, ఈ బకరా కామెడీల నుంచి కోన వెంకట్ ఎప్పుడు బయటికొస్తాడో అంటూ రాశారని, ఆ మాటలకు నాపై నాకే జాలేసిందని కోన వెంకట్ తెలిపాడు.
హీరో ఒకరింటికి వెళ్లి అక్కడి వాళ్లను బకరాలను చేసే కాన్సెప్ట్ లో తాను ఎన్నో సినిమాలు చేశానని, చివరకు తన ఫార్ములాపై తనకే బోర్ కొట్టి ఆ తరహా కథలు రాయడం మానేశానని వెంకట్ చెప్పాడు. ప్రస్తుతం తాను చిరంజీవి(Chiranjeevi)- బాబీ(Bobby) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో పాటూ, మరో బాలీవుడ్ మూవీకి వర్క్ చేస్తున్న విషయాన్ని కూడా కోన ఈ సందర్భంగా బయటపెట్టాడు.






