Chennai Love Story: “చెన్నై లవ్ స్టోరీ” నుంచి హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ బర్త్ డే పోస్టర్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, (Kiran Abbavaram)యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ(Sri Gouri Priya), జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు విశెస్ తెలియజేస్తూ “చెన్నై లవ్ స్టోరీ” సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బ్యూటిఫుల్ లవ్ పెయిర్ గా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో నివి క్యారెక్టర్ తో శ్రీ గౌరి ప్రియ ప్రేక్షకులకు మరింత చేరువకానుంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది.






