Kingdom: కింగ్డమ్ ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన తాజా సినిమా కింగ్డమ్(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజై ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ కూడా క్యూ కడుతుండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్టనర్ ను మేకర్స్ లాక్ చేశారు.
కింగ్డమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత కింగ్డమ్ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేలా సదరు ఓటీటీ సంస్థతో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఆగస్ట్ నెలాఖరుకు కింగ్డమ్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయన్నమాట.
కాగా కింగ్డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎంతో కష్టపడగా, అతను పడిన కష్టమంతా స్క్రీన్ పై చాలా స్పష్టంగా తెలుస్తోంది. భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్(Satyadev) కీలక పాత్రలో కనిపించగా, కింగ్డమ్ కు అనిరుధ్(anirudh) ఇచ్చిన మ్యూజిక్ బాగా ఎలివేట్ అయింది. ఈ సినిమాను నాగవంశీ(naga vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు.







