కింగ్100.. రిలీజ్‌పై క్లారిటీ!
అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కింగ్100 (King100). రా. కార్తీక్(Ra. Karthik) దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna studios) పతాకంపై అక్కినేని ఫ్యామిలీ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొద్దిరోజులుగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అవనుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ ఆ వార్తలకు చెక్ పెట్టారు. ముందుగా అనౌన్స్ చేసినట్టుగానే డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందించిన తాజా పోస్టర్లో నాగార్జున బ్లాక్ సూట్లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన రాయల్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. ఆ తర్వాత టబు(Tabu) క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కూడా ఆసక్తిని రేకెత్తించింది. నాగార్జున, టబు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. వీరిద్దరినీ మరోసారి వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాలో అశోక్ సెల్వన్(Ashok selvan) కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్(Devi sri prasad) అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే గ్లింప్స్‌కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి. నాగార్జున సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులకు అందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.







