చరణ్ ను మ్యాచ్ చేయలేకపోయానంటున్న కియారా
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇది రెండో సారి. గతంలో వినయ విధేమ రామ కోసం జత కట్టిన వీరిద్దరూ ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ కోసం కలిసి నటిస్తున్నారు. ఆ ఇప్పటికే ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే.
ఆ పాటలో ఇద్దరూ పోటీపడి మరీ డ్యాన్స్ వేసినట్లు అర్థమవుతోంది. అయితే ఆ సాంగ్ లో చరణ్ తో డ్యాన్స్ చేయడం తన వల్ల కాదనేసింది కియారా. రీసెంట్ గా ఆన్ సెట్స్ లో ఆ సాంగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకున్న కియారా ఇప్పటివరకు తను చేసిన పాటల్లో ఇదే కష్టమైనదని, ఈ సాంగ్ షూటింగ్ దాదాపు 10 రోజుల పాటూ జరిగినట్లు తెలిపింది.
సాంగ్ కోసం షూటింగ్ తర్వాత కూడా రోజులో మూడు, నాలుగు గంటలు రిహార్సల్స్ చేయాల్సి వచ్చిందని చరణ్ ను మ్యాచ్ చేయడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని, కష్టమైనా ఇది తనకు మంచి అనుభవమని చెప్పుకొచ్చింది కియారా. అంతేకాదు శంకర్ తో పని చేయాలన్న తన కోరిక ఈ సినిమాతో తీరినట్లు తెలిపింది కియారా. మొత్తానికి కియారాను చరణ్ తన డ్యాన్సులతో బాగానే ఇబ్బంది పెట్టాడన్నమాట.













