Dragon: డ్రాగన్ స్పెషల్ సాంగ్ లో ఆ బ్యూటీ?

కొరటాల శివ(Koratala Siva)తో కలిసి గతేడాది దేవర(Devara)తో మంచి సక్సెస్ ను అందుకున్న ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrtihik Roshan) తో కలిసి వార్2(War2) తో పాటూ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. వాటిలో వార్2 సినిమా ఆల్రెడీ షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఆగస్ట్ 14న వార్2 రిలీజ్ కానుంది.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా లో ఎన్టీఆర్ ను నీల్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో చూపించనున్నాడట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమాకు డ్రాగన్(Dragon) అనే వర్కింగ్ ను టైటిల్ ను పరిశీలిస్తుండగా, ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ గా నిలిచేలా నీల్ తెరకెక్కిస్తున్నాడట.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. అందులో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఎన్టీఆర్ తో కలిసి చిందులేయనున్నట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, రీసెంట్ గా రాబిన్‌హుడ్(robinhood) సినిమాలో అదిదా సర్‌ప్రైజు(Adhidha SurpriseU) సాంగ్ చేసి యూత్ ను ఓ ఊపు ఊపిన కేతికా శర్మ(Kethika Sharma). డ్రాగన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఈ బ్యూటీని సంప్రదించగా, అమ్మడు ఓకే చెప్పిందని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.