Revolver Rita: రివాల్వర్ రీటా భారమంతా కీర్తిపైనే!
మహానటి(mahanati) మూవీతో నేషనల్ అవార్డును అందుకున్న కీర్తి సురేష్(keerthy suresh) సౌత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే గత కొన్నాళ్లుగా కీర్తి ఖాతాలో చెప్పుకోదగ్గ సక్సెస్లు లేవు. ఆఖరిగా దసరా(dasara)తో హిట్ అందుకున్న కీర్తి ఆ తర్వాత చేసిన భోళా శంకర్(bhola shankar), బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేసిన బేబీ జాన్(baby john) ఫ్లాపుగా నిలిచాయి. అయితే ప్రస్తుతం కీర్తి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
అయితే కీర్తి సురేష్ జే కే చంద్రు(JK Chandru) దర్శకత్వంలో రివాల్వర్ రీటా(revolver rita) అనే మూవీ చేసిన సంగతిత తెలిసిందే. ఈ మూవీ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ మూవీ నవంబర్ 28న రిలీజవుతుంది. తాజాగా రివాల్వర్ రీటా ట్రైలర్ రిలీజవగా, కథ చూస్తుంటే రొటీన్ గానే అనిపిస్తుంది. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే పై డిసైడ్ అయి నడిచేలా కనిపిస్తుంది.
అయితే ఈ సినిమా మొత్తం కీర్తి భుజాలపై మోసిందనే చెప్పాలి. రివాల్వర్ రీటాకు ఆడియన్స్ రావాలంటే అందులో సెల్లింగ్ పాయింట్ కీర్తి మాత్రమే. సినిమాలో కీర్తి రోల్ ఎంగేజింగ్ గా లేకపోతే సినిమాతో పాటూ అమ్మడు కూడా రిస్క్ లో పడుతుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న కీర్తికి ఈ సినిమా సక్సెస్ అయితే అది మంచి బూస్టప్ లాగా అనిపిస్తుంది. మరి రివాల్వర్ రీటా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.






