ఆ నిర్మాణ సంస్థలో కీర్తి
సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. జయం రవి హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సైరన్ సినిమాలో కీర్తి పోలీసాఫీసర్ గా కనిపించనుంది. దీనికి తోడు మరో మూడు సినిమాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి.
గ్యాప్ లేకుండా అన్ని తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో దూసుకెళ్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. రాధికే ఆప్టే తో కలిసి పీరియాడికల్ జానర్ లో రివెంజ్ థ్రిల్లర్ లో నటిస్తోంది కీర్తి. అక్క అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ధర్మరాజ్ శెట్టి ఈ సిరీస్ తో డైరెక్టర్ గా పరిచయం కానున్నాడని తెలుస్తోంది.
ఈ సిరీస్ వచ్చే ఏడాది ఓటీటీలోకి రానుందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. భిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న కీర్తి సురేష్ ఈ సిరీస్ లో ఎలాంటి పాత్ర చేస్తుందో అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. కాగా ఈ సిరీస్‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కీర్తి డిజిటల్ ఎంట్రీ లేటయినా మంచి బ్యానర్ మూవీతో ఎంటర్ అవుతుందని అందరూ అంటున్నారు.













