మిస్ ఇండియాగా కీర్తి సురేష్
మహానటి తో జాతీయ ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకున్న కీర్తి సురేశ్ నటిస్తున్న తాజా చిత్రానికి మిస్ ఇండియా అనే పేరు ఖరారైంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న చిత్రమిది. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ మహానటి చిత్రంతో కీర్తి సురేశ్ తెలుగువారి గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఆమె నుంచి ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్ని ఆశిస్తారో, అలాంటి చిత్రమే ఇది. ఈ చిత్రంలో మేం చూపించే సిట్చువేషన్‌ని..ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొని ఉంటుంది. సింహభాగం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని తెరకెక్కించి అక్టోబర్‌లో గానీ, నవంబర్‌లోగానీ సినిమా విడుదల చేస్తాం అని అన్నారు.













