Yellamma: దేవీతో ఆమె చేస్తుందా?

సినీ ఇండస్ట్రీలో ఎవరికెప్పుడు ఎటునుంచి ఎలాంటి అవకాశమొస్తుందో చెప్పలేం. ఇప్పుడలాంటి ఛాన్సే మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(devi sri prasad) కు వచ్చింది. బలగం(balagam) సినిమాతో డైరెక్టర్ గా మారిన వేణు యెల్దండి(venu yeldandi), మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తనలో మ్యాటర్ ఉందని నిరూపించుకున్నాడు. బలగంను తక్కువ బడ్జెట్ లో తీసి ఆ సినిమాతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిసేలా చేశాడు వేణు.
బలగం తర్వాత వేణు నుంచి ఎల్లమ్మ(Yellamma) అనే ప్రాజెక్టు రానుందని, ఆ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil Raju) నిర్మిస్తారని అన్నారు. అందులో భాగంగానే ముందు ఎల్లమ్మలో నాని(nani) హీరో అన్నారు, తర్వాత అదే ప్రాజెక్టు నితిన్(nithin) వద్దకు వెళ్లిందని, నితిన్ ఓకే కూడా చెప్పాడని అన్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల నితిన్ ఎల్లమ్మ నుంచి తప్పకున్నాడు.
దీంతో ఆ సినిమా దేవీ శ్రీ ప్రసాద్(DSP) దగ్గరకు వెళ్లి, ఆయన హీరోగా ఎల్లమ్మ తెరకెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఎల్లమ్మలో హీరోయిన్ గా నటించడానికి కీర్తి సురేష్(Keerthy Suresh) ఓకే చెప్పిందని నితిన్ హీరోగా ఫిక్స్ అయినప్పుడే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు నితిన్ సినిమా నుంచి తప్పుకున్నాడు. మరి నితిన్ తప్పుకున్నాడని కీర్తి కూడా ఎల్లమ్మ నుంచి తప్పుకుంటుందా లేదా దేవీ శ్రీ తో కలిసి నటిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా సెట్స్ కు వెళ్లకుండానే ఎల్లమ్మ మూవీ వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది.