సినిమా బడ్జె్ట్ 4 కోట్లు.. ఓటీటీ ద్వారా వచ్చింది 7.5 కోట్లు!
ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు పెద్ద హీరోల సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయినపుడు మొదటి రోజు నుంచి 50 రోజులు, 100 రోజుల వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, టోటల్‌గా ఎంత కలెక్ట్ చేసింది, తమ అభిమాన హీరో ఎక్కడెక్కడ రికార్డులు సృష్టించాడు అనే విషయంలో అభిమానుల్లో విపరీతమైన చర్చ నడిచేది. రాను రాను రోజులు తగ్గాయి. రెండు మూడు వారాల్లోనే ఎంత పెద్ద సినిమా అయినా టోటల్ ఎంత కలెక్ట్ చేసింది అనేది తెలిసిపోతోంది. కానీ, ఇప్పుడు అది కూడా లేదు. నాలుగు నెలలుగా థియేటర్స్ మూసి ఉండడం, ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అవుతాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈలోగా ఓటీటీలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో సినిమా రిలీజ్ చెయ్యాలంటే తమ సినిమాకు ఎంత బడ్జెట్ అయ్యింది, ఓటీటీ సంస్థలు ఇచ్చేది ఎంత అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఓ రేంజ్ సినిమాలు మాత్రమే. ఇటీవల విడుదలైన కీర్తి సురేష్ సినిమా `పెంగ్విన్` ఆడియన్స్‌ని నిరాశపరిచింది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఓటీటీలో సంస్థ మాత్రం ఈ సినిమాకి బాగానే ముట్టజెప్పిందని తెలుస్తోంది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 4 కోట్లు. ఓటీటీ సంస్థ ఇచ్చింది 7.5 కోట్లు. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు డబుల్ వచ్చింది. ఇది కాక శాటిలైట్ రైట్స్ 6 కోట్లు వచ్చిందట. దీన్నిబట్టి చూస్తే ఓటీటీలో రిలీజ్ చెయ్యడం వల్ల నిర్మాతలకు లాభమే తప్ప నష్టం లేదనేది అర్థమవుతోంది. `పెంగ్విన్` తర్వాత కీర్తి సురేష్ నటించిన `మిస్ ఇండియా`, `గుడ్‌లక్ సఖి` చిత్రాలు కూడా ఓటీటీలోనే రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇక పెద్ద హీరోల సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలకు ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఏదో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప చెప్పలేము. ఏది ఏమైనా ప్రస్తుతం ఓటీటీ వల్ల నిర్మాతకు కాస్త ఊరట లభిస్తుందనేది మాత్రం వాస్తవం.













