రాయల్ లుక్ లో మెరిసిపోతున్న ప్యారడైజ్ బ్యూటీ
యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ కయాదు లోహర్(Kayadhu lohar) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నేచుల్ స్టార్ నాని(nani)తో ది ప్యారడైజ్(the paradise) సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్న కయాదు తాజాగా దేవకన్యలా రాయల్ లుక్ లో మెరిసింది. ఈ ఫోటోలో అమ్మడు కస్టమ్ ఐవరీ డ్రేప్డ్ ఇండో వెస్ట్రన్ ఎన్సెంబుల్ ను సెలెక్ట్ చేసుకోగా, డీపీ వీ నెక్ క్రాప్ టాప్, మల్టీ వే వ్రాప్డ్ చిఫ్ఫాన్ డ్రేప్స్, ఫ్లోవీ షీర డ్రెస్ లో మెరవగా, దానికి బెలూన్ స్లీవ్స్, కట్ వర్క్ డిజైన్, హై వేస్టెడ్ ఫిట్టెడ్ స్కర్ట్ ఆమె లుక్ ను మరింత హైలైట్ చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు కాయదు అందాల్ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోల్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు.









