Kayadhu Lohar: చీరకట్టులో మెరిసిపోతున్న డ్రాగన్ భామ

అల్లూరి(Alluri) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కయాదు లోహర్(Kayadhu Lohar) డ్రాగన్(Dragon) సినిమాతో స్టార్ బ్యూటీగా మారి ప్రశంసలతో పాటూ వరుస ఆఫర్లను కూడా అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ సినిమాలతో బిజీగా ఉన్న కయాదు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో చీరలో తెగ మెరిసిపోయింది. బ్లూ శారీ దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి కయాదు, మెడలో ముత్యాల నెక్ సెట్ ధరించి చూడముచ్చటగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. కయాదు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.