Kannappa: ‘కన్నప్ప’ అద్భుతంగా ఉంది.. ప్రత్యేక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం

విష్ణు మంచు ‘కన్నప్ప’ (Kannappa Special Show)చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమాను రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,(Deputy CM Batti Vikramark) సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, (Cinemotography Munuster Komati Reddy Venkata Reddy)మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వంటి వారు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. వీరితో పాటుగా మోహన్ బాబు, విష్ణు వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సందడి చేశారు.
*‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉంది. అర్జునుడిగా, తిన్నడిగా, కన్నప్పగా విష్ణు అద్భుతంగా నటించారు. ఇంత గొప్ప చిత్రం నిర్మించిన మోహన్ బాబు గారికి అభినందనలు. కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని ఇలా గొప్పగా అనిపించాయి. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుంది’ అని అన్నారు.
*సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ* .. ‘చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశాను. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబు గారికి, విష్ణుకి ధన్యవాదాలు. శివ భక్తులంతా పరవశించి పోయేలా మూవీని తీశారు. మేం అంతా కలిసి ఈ మూవీని చూసి ఎంతో ఆనందించాం. మన కథను అందరికీ తెలిసేలా చేయాలి. ఇలాంటి చిత్రాల్ని అప్పుడప్పుడు అయినా తీయాలని సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేను అందరినీ కోరుతున్నాను’ అని అన్నారు.