నేను రాజకీయాల్లోకి రావాలంటే ఇదే సరైన సమయం
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రానున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. తనకు రాజకీయ నేపథ్యం లేకపోవడమనేది దేశానికి సేవ చేసేందుకు అడ్డంకి కాదన్నారు. ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ నేను దేశం కోసం ఎంతో చేశాను. సినిమా సెట్ నుంచి రాజకీయ పార్టీలతో పోరాడాను. జాతీయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండు దశాబ్దాల నుంచి నటిగా వచ్చిన గుర్తింపు కంటే జాతీయవాదిగానే అందరికి తెలిసిందే. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ దేశంలోని అన్ని ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం ఉంది. నార్త్ నుంచి వచ్చిన సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేశాను. ఝాన్సీరాణి వంటి శక్తిమంతమైన పాత్రలనూ చేశా. ప్రజలు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించేవారికి రుణపడి ఉంటాను అని తెలిపారు.













