కమల్ ఎప్పటికీ లోకనాయకుడే!
కేవలం తమిళంలోనే కాకుండా మిగిలిన అన్ని భాషల్లోనూ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న కమల్ హాసన్(Kamal Haasan)ను ఆయన ఫ్యాన్స్ ఉలగనాయగన్ (లోక నాయకుడు) అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే తనను ఉలగనాయగన్ అనే బిరుదుతో పిలవొద్దని కేవలం తన పూర్తి పేరు లేదా కమల్ లేదా కెహెచ్ అని మాత్రమే పిలవాలని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి ఇది మంచి విషయమే. బాల్యం నుంచి ఇప్పటివరకు అతను చేయని పాత్ర, ట్రై చేయని ప్రయోగం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఫ్యాన్స్ ప్రేమతో ఆయన్ని లోకనాయకుడని పిలుస్తారు. దశావతారం(Dasavatharam) సినిమా నుంచి కమల్ ను ఆయన ఫ్యాన్స్ ఇలానే పిలుస్తున్నారు. మరి ఇప్పుడు సడెన్ గా కమల్ ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటన్నది తెలియదు. కానీ ఈ నిర్ణయం మాత్రం మంచిదే.
సినిమా కంటే ఎవరూ పెద్ద కాదనే మెసేజ్‌ను కమల్ ఈ విధంగా తెలియచేశారు. అయితే కమల్ కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. విక్రమ్(Vikram) సినిమాతో రికార్డులను బ్రేక్ చేసిన కమల్, రీసెంట్ గా తన బ్యానర్ లో నిర్మించిన అమరన్(amaran) తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇండియన్2(Indian2) ఫ్లాప్ అయినా థగ్ లైఫ్(Thug Life) సినిమాపై మంచి బజ్ ఉంది. 70 ఏళ్ల వయసులో కూడా ఇంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కమల్ ఎప్పటికీ లోకనాయకుడే. కాకపోతే ఆయన వద్దన్నాక కూడా ఆ పిలుపుతో పిలవడం సమంజసం కాదు.













