Kamal Hassan: కమల్ నెక్ట్స్ ఆ డైరెక్టర్ తోనేనా?

లోక నాయకుడు కమల్(Kamal hassan) విక్రమ్(vikram) సినిమాతో మంచి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక కమల్ ఫామ్ లోకి వచ్చినట్టే అంతా భావించారు. కానీ శంకర్(shankar) తో చేసిన ఇండియన్2(indian2) సినిమా కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. పోనీ మణిరత్నం(mani ratnam)తో చేసిన థగ్ లైఫ్(thug life) సినిమా అయినా కమల్ కు మంచి హిట్ ను అందించిందా అంటే అదీ లేదు.
థగ్ లైఫ్ సినిమా కూడా ఇండియన్2 ఫలితాన్నే ఇచ్చింది. దీంతో విక్రమ్ సినిమాకు ముందు కమల్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తిరిగి అదే పొజిషన్ కు వచ్చారు. వరుస ఫ్లాపులు కమల్ ఇమేజ్ ను తగ్గించకపోయినా, అతని మార్కెట్ ను మాత్రం బాగా డౌన్ చేసింది. దీంతో ఇప్పుడు కమల్ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తారా అనే ఆసక్తి ఎక్కువైపోయింది.
విక్రమ్2(vikram2) అన్నారు కానీ అది ఇప్పట్లో అయ్యే పని కాదు, అన్బు(Anbu)- అరివు(Arivu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి కానీ ఆ సినిమా కూడా హోల్డ్ లో పడిందని తెలుస్తోంది. పోనీ ఇండియన్3(Indian3) చేసే ఛాన్సుందా ఉంటే ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరగడం లేదు. అయితే ఇప్పుడు కమల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. చిన్నా(Chinna), వీర ధీర శూరన్2(Veera dheera sooran2) సినిమాలకు దర్శకత్వం వహించిన అరుణ్ కుమార్(Arun kumar) చెప్పిన కథకు కమల్ ఓకే చెప్పారని, కమల్ నెక్ట్స్ మూవీ అతనితోనే ఉంటుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్సుంది.