Kalki2: కల్కి2 పై క్రేజీ అప్డేట్
ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898(Kalki2898AD)ఏడీ సినిమా ఎంత పెద్ద హిట్టన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని కల్కి క్లైమాక్స్ లో చెప్పారు. దీంతో కల్కి2(Kalki2) ఎప్పుడెప్పుడొస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశాడట.
తాజా సమాచారం ప్రకారం కల్కి2 జూన్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, మొదటి షెడ్యూల్ లో విశ్వ నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కల్కి2లో తన పాత్ర ప్రధానంగా ఉంటుందని కమల్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. కల్కిలో సుప్రీమ్ గా కమల్ కనిపించింది కాసేపే అయినా ఆ పాత్రకు ప్రాణం పోసి మంచి ప్రశంసలందుకున్నాడు కమల్.
ఇదిలా ఉంటే కల్కి సీక్వెల్ గా వచ్చే ఈ సినిమాకు కర్ణ 3102(Karna 3102) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. కల్కి సినిమా కర్ణుడి పాత్రతో ముగుస్తుంది కాబట్టి దానికి సీక్వెల్ గా రానున్న ఈ సినిమా మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతందని అర్థం చేసుకోవచ్చు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి2 ను 2026 ఎండింగ్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.













