అల్లరోడి సరసన చందమామ…
అల్లరి నరేష్ రొటీన్‌కు భిన్నంగా డిఫరెంట్ జానర్లను ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లరి నరేష్ ఓ కొరియన్ మూవీ రీమేక్‌లో నటించనున్నారని తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్‌బాబు తాజాగా కొరియన్ మూవీ డాన్సింగ్ క్వీన్.. రీమేక్ రైట్స్‌ను దక్కించుకుని స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఇందులో నరేష్ హీరోగా నటిస్తారని తెలుస్తోంది. హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలని సురేష్‌బాబు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇందుకు ఆమెతో సంప్రదింపులు కూడా చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.













