Kajal: మెగా ఫోన్ పట్టనున్న కాజల్?

టాలీవుడ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్(Kajal), కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కాజల్ మొదట్లో గ్లామరస్ రోల్స్ తో పాటూ పద్దతైన పాత్రలు కూడా చేసింది. కోలీవుడ్ లో అందాల ఆరబోతకు ఎక్కువగా పరిమితమైన కాజల్ మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవి నిరాశ పరిచాయి.
మధ్యలో పెళ్లి చేసుకుని కొన్నాళ్ల పాటూ ఇండస్ట్రీకి దూరమైన కాజల్, బాబు పుట్టాక మళ్లీ సినిమాల్లోకి వచ్చినప్పటికీ మునుపటిలా అమ్మడికి అవకాశాలైతే రావడం లేదు. ప్రస్తుతం కాజల్ చేతిలో ఇండియన్3(Indian3), కన్నప్ప(Kannappa) సినిమాలు తప్ప మరే ప్రాజెక్టులు లేవు. దీంతో మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుని ఎలాగైనా లైమ్ లైట్ లోకి రావాలనే ఆలోచనతో కాజల్ కొత్త అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే కాజల్ అగర్వాల్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా సినిమా చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. సొంత డైరెక్షన్ లో హీరోయిన్ గా సినిమా చేసి సత్తా చాటాలని చూస్తోందట కాజల్. కమర్షియల్ అంశాలతో బాలీవుడ్ లో ఓ సినిమాను తెరకెక్కించడానికి కాజల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆల్రెడీ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన కాజల్, ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ గా మారి రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.