కాజల్ ఫ్యాన్స్ కు ట్విస్టిచ్చిన శంకర్
పెళ్లి చేసుకుని బాబు పుట్టాక సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. ఆమె లీడ్ రోల్ లో నటించిన సత్యభామ వచ్చే వారం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కాజల్ పోలీసాఫీసర్ గా కనిపించనుంది. సత్యభామ కోసం కాజల్ క్షణం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తుంది.
ఇక అసలు విషయానికొస్తే కాజల్ ఆ మధ్య చిరంజీవి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కొంత పార్ట్ షూట్ చేశాక ఆమె పాత్రను పూర్తిగా తొలగించడంతో అమ్మడి ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. కాకపోతే ఆ సినిమా రిజల్ట్ చూశాక కాజల్ నటించకపోవడమే మంచిదనుకున్నారు అది వేరే విషయం. ఇకపోతే కాజల్ నటిస్తున్న ఇండియన్2 వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రానుంది.
కమల్ హాసన్ తో తను చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో కాజల్ ఎంతో ఎగ్జైటింగ్ ఉంది. రీసెంట్ గా ఇండియన్2 ఆడియో లాంఛ్ చెన్నై లో జరిగింది. ఆ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్, కాజల్ పాత్రకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని చెప్పి అందరికీ షాకిచ్చాడు. ఇండియన్2 లో కాజల్ ఉండదని, మూడో భాగంలో మాత్రమే తన పాత్ర ఉంటుందని, ఆ భాగంలోనే తను కనిపిస్తుందని చెప్పాడు. శంకర్ ఒకవేళ ఈ విషయాన్ని చెప్పకపోయుంటే కాజల్ ఫ్యాన్స్ సినిమా చూశాక ఇంకా ఎక్కువ షాకయ్యేవారు. ముందే చెప్పి మంచి పని చేశాడు. ఇకపోతే ఇందులో కాజల్ పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ 2 రిలీజైన ఆరు నెలల తర్వాత ఇండియన్3 రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట.













