కైరాకు మరో ఆఫర్
ఈ మధ్య బాలీవుడ్లో భారీ క్రేజ్ సాధించిన హీరోయిన్లలో కైరాఅద్వాని ఒకరు. ముఖ్యంగా కబీర్ సింగ్ తర్వాత కైరాకు డిమాండ్ పెరిగింది. అటు బాలీవుడ్ సినిమాలే కాదు కైరా టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కైరా ఆ సినిమా తర్వాత చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఇప్పుడు కైరాకు మరో ఆఫర్ వచ్చిందట. మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాలోనే కైరాను హీరోయిన్గా తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇంకా కైరా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. కైరాకు టాలీవుడ్ సినిమాలో నటించేందుకు అభ్యంతరం లేదు కానీ తన డైరీ ఖాళీ లేకపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయగలనా లేదా అని ఆలోచిస్తోందట. ఒకవేళ డేట్స్ సర్దుబాటు చేయగలిగితే మాత్రం కియారా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో రోమాన్స్ చేయడం పక్కా అని అంటున్నారు.













