మిలియన్ డాలర్ల క్లబ్ లో కాలా
సూపర్‌స్టార్ రజనీకాంత్ అమెరికాలో తన సత్తా చాటారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం కాలా. పా రంజిత్ దర్శకుడు. వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ సినిమాను నిర్మించారు. తొలిరోజున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా కాలా అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది. సినిమా అక్కడి బాక్సాఫీసు వద్ద రెండు రోజుల్లో ఈ వసూళ్లను సాధించినట్లు విశ్లేషకులు చెప్పారు. అయితే ఈ చిత్రం కబాలి రికార్డును బ్రేక్ చేయలేకపోయిందని పేర్కొన్నారు. కబాలి కేవలం అమెరికా ప్రీమియర్ షోలలో 1.9 మిలియన్ డాలర్లు రాబట్టింది.













