పోలీస్ పటాస్ ట్రైలర్‌ను ఆవిష్కరించిన రోశయ్య
ఆయేషా హబీబ్, రవికాలే ప్రధాన పాత్రలో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పోలీస్ పటాస్. భీమవరం టాకీస్‌పై తమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. రోశయ్య 87 జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చేత ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరింపజేశారు. రామ సత్యనారాయణ మాట్లాడుతూ మా విజయాల వెనుక స్ఫూర్తిని అందించిన రోశయ్య. త్వరలో పోలీస్ పటాస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆయేషా నటన ఈ చిత్రానికి హైలైట్. మాస్కు ఆకట్టుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు.













