లాయర్‌గా జ్యోతిక
సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నటిస్తూ ప్రశంసల్ని అందుకుంటున్నది జ్యోతిక. తాజాగా ఆమె లాయర్‌గా ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నది. ఆమె కథానాయికగా తమిళంలో పోన్మగల్ వంధాల్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. జ్యోతిక భర్త, హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జె.జె.ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహిస్తున్నారు. జ్యోతిక ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా హీరో సూర్య విడుదల చేశారు. లాయర్ దుస్తుల్లో శక్తివంతంగా ఈ పోస్టర్లో జ్యోతిక కనిపిస్తున్నది. ఆమె వెనుక క్రైమ్ వార్తలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ఉండటం ఆసక్తిని పంచుతున్నది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కె.భాగ్యరాజా, పార్తిబన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది.













