#NTR30లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు?
ఆర్ఆర్ఆర్ తో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను పాన్ ఇండియన్ రేంజ్లో ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే తనకు జనతా గ్యారేజ్ లాంటి మంచి విజయాన్ని అందించిన కొరటాలతో తన తర్వాతి సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు ఎన్టీఆర్.
#NTR30 వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ ఎట్టకేలకు అక్టోబర్ థర్డ్ వీక్‌లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ సెట్స్ పైకి వెళ్లనుంది. దీంతో ఎన్టీఆర్‌ను కొరటాల ఈసారి ఎలా చూపించబోతున్నాడా అనేది ఆసక్తి కరంగా మారింది.
ఎన్టీఆర్ బర్త్ డే రోజున రిలీజ్ అయిన డైలాగ్ మోషన్ పోస్టర్ ను బట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మంచి పవర్ ఫుల్ గా ఉండనుందనేది అయితే స్పష్టమైంది. మరి ఈ పాత్రకు సంబంధించి మేకోవరి ఎలా ఉండనుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సినిమా కోసం ఇప్పటికే బరువు తగ్గిన ఎన్టీఆర్ మరో 5 కేజీల బరువు తగ్గనున్నాడట. దీని కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోని ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.













