ఐపిఎల్ తెలుగు అంబాసిడర్ గా జూ. ఎన్టిఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు జూనియర్ ఎన్టిఆర్ నియమితులయ్యారు. ఈ వార్త ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టిఆర్ మాట్లాడుతూ క్రికెట్‌ను ఆస్తి లాగా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. క్రీడలు ఒక లాంగ్వేజ్‌లాగా కూడా పనికొస్తాయి. క్రీడల ద్వారానే ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోగలుగుతున్నారు. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్‌ను చూసేవారు. ఆయన చూడటం దగ్గర నుంచి నేను క్రికెట్ పట్ల ఆ ప్రేమను పెంచుకోవడం జరిగింది. నేను నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్ పట్ల ప్రేమను పెంచుతా. ఒక్క భారతదేశంలోనే ఇంతగా క్రికెట్‌ని ఆస్వాదించడం జరుగుతోంది. ఒక కొత్త డైమన్షన్‌కి క్రియేట్ చేసింది ఐపిఎల్. అలాంటి కొత్త డైమన్షన్‌కి తెలుగుభాషలో దాని కామెంట్రీ చేస్తే, స్టార్ మా మూవీస్‌లో దాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకున్నందుకు నిజంగా స్టార్ ఇండియా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు.













