2021 మొత్తం రామారావు బిజీయేగా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్న రోజుల్లో మరింత బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం చేస్తుంది ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటే కదా అది కూడా ఆఖరిలో ఉంది మరి బిజీ ఎలా అవుతాడనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎన్టీఆర్ చేతినిండా సినిమాల కంటే ఎక్కువగా ప్రోగ్రామ్సే ఉన్నాయి. వాటన్నింటికీ అటెండ్ అవనున్నాడు తారక్. త్వరలో ఎన్టీఆర్ అటెండ్ అయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ రెండున్నాయి. అందులో ఒకటి రంగ్ దే, రెండోది తెల్లవారితే గురువారం సినిమా ఈవెంట్. వీటిలో రంగ్ దే ఈవెంట్ కు మాత్రం ఎన్టీఆర్ ఒక్కడే చీఫ్ గెస్ట్ కాగా, తెల్లవారితే గురువారం ఈవెంట్ కు మాత్రం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి కూడా గెస్ట్ గా రానున్నారు.
ఇవే కాకుండా బుల్లి తెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రామారావు కొత్త బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. పాపులర్ రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు కు హోస్ట్ గా ఎన్టీఆర్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. రియాలిటీ షో అంటే ఎంత బిజీగా ఉంటారో తెలియని విషయం కాదు. ఇవి కాకుండా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉందట. అది పూర్తి చేసి, పెద్దగా గ్యాప్ కూడా తీసుకోకుండానే త్రివిక్రమ్ తో కలిసి అయినను పోయిరావలె హస్తినకు షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు తారక్. సినిమా ఇప్పటికే లేట్ అవడంతో ఉగాదికి సినిమా ను స్టార్ట్ చేసి త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనే కసితో ఉన్నారట మేకర్స్. మొత్తానికి ఈ సంవత్సరం మొత్తం ఎన్టీఆర్ అసలు ఖాళీగా ఉండే అవకాశాలే లేనట్టున్నాయి.













