ఈ నెల 21న ‘గొరిల్లా’ విడుదల
జీవా కథానాయకుడిగా నటించిన చిత్రం గొరిల్లా. షాలినీ పాండే నాయిక. డాన్ శాండీ దర్శకుడు. గంగా అంబరీష్ రెడ్డి నిర్మాత. ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ బ్యాంకుని దోపిడీ చేయడానికి ఓ బృందం ప్రణాళిక రచిస్తుంది. ఆ బృందానికి ఓ గొరిల్లా ఎలా సాయం చేసిందన్నదే కథ. కాంగ్ అనే గొరిల్లాను థాయ్ లాండ్ నుంచి తీసుకొచ్చాం. గొరిల్లా నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. త్వరలోనే ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. రాధారవి, యోగిబాబు, రాజేంద్రన్, రాందాస్, సతీష్, వివేక్ తదితరులు నటించారు.













