వరల్డ్ రికార్డ్ సాధించిన బెల్లంబాబు సినిమా
కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి పెద్ద బడ్జెట్ లో పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఈ మధ్య బెల్లంబాబు స్పీడు తగ్గించాడు. ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లో మంచి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు కానీ అది సరిగా ఆడలేదు. ఇప్పుడు శ్రీనివాస్ భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర తో టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ పాత సినిమా ఒకటి ఇప్పుడు సంచలన రికార్డును సొంతం చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చిన జయ జానకి నాయక సినిమా హిందీ వెర్షన్ యూ ట్యూబ్లో అత్యథిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాగా ప్రపంచ రికార్డు సాధించింది.
ఈ సినిమా ఏకంగా 800 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించింది. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ సినిమాకూ యూట్యూబ్ లో ఇన్ని వ్యూస్ రాలేదు. ఈ సినిమా వరల్డ్ రికార్డ్ సాధించినట్లు పెన్ మూవీస్ ట్విట్టర్లో ప్రకటించింది. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన మాస్ సినిమాలన్నీ నార్త్ లో మంచి వ్యూస్ ను తెచ్చుకుంటున్నాయి.













