‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో వెంకటేష్ సినిమా
సీనియర్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఓ యంగ్ డైరెక్టర్‌తో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న వార్త. అసలు ఈ సీనియర్ స్టార్ ఎవరితో పనిచేయబోతున్నారనే వివరాల్లోకి వెళితే.. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె వి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్చే యబోతున్నారంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ చేస్తోన్న చిత్రం F3. ఇందులో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ రానా నాయుడలో దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ ఏ సినిమా చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.
అయితే తాజా సమాచారం మేరకు, జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అనుదీప్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల ముందే వెంకటేష్‌ను అనుదీప్ కలిసి కథను చెప్పారట. ఆయనకు కథ నచ్చేసింది. సినిమా చేయడానికి ఓకే చెప్పేశారట. ప్రస్తుతం అనుదీప్.. తెలుగు, తమిళ భాషల్లో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే వెంకటేష్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళతారట. వెంకటేష్ – అనుదీప్ కె వి కాంబోలో రూపొందబోయే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ హీరోగా సీనియర్ దగ్గుబాటి హీరోకు మంచి ఇమేజ్ ఉంది. వెంకీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకునే అనుదీప్ కథను సిద్ధం చేశారట. త్వరలోనే వెంకటేష్ తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని సమాచారం. ఈ ఏడాది మే 27న వెంకటేష్ F3 సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.













