Janhvi Kapoor: జాన్వీ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందా?

దివంగత తార శ్రీదేవి(Sridevi) కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ(Janhvi)కి అక్కడ సినిమాలతో పెద్దగా పేరు రాలేదు. దీంతో జాన్వీ తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. తెలుగులో సినిమాలు చేస్తే తల్లి శ్రీదేవికి దగ్గరగా ఉండొచ్చనే ఉద్దేశంతో టాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఎన్టీఆర్(NTR) హీరోగా వచ్చిన దేవర(Devara) సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది.
దేవర రిలీజ్ కాకముందే రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటిస్తున్న పెద్ది(Peddhi) సినిమాలో ఆఫర్ ను కొట్టేసింది జాన్వీ. మొదటి సినిమాను తారక్(Tarak) తో, రెండో సినిమాను చరణ్(Charan) తో చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన జాన్వీ ఇప్పుడు తెలుగులో మరో బంపరాఫర్ ను అందుకోబోతుందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాను పూర్తి చేస్తున్న జాన్వీకి ఇప్పుడో ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
అదే అల్లుఅర్జున్(Allu Arjun) తో సినిమా. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జవాన్(Jawaan) తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో పాటూ పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో జాన్వీ ఛాన్స్ అందుకుంటే జాన్వీ కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం పక్కా అని భావిస్తున్నారు ఆమె ఫ్యాన్స్.