Jai Hanuman: సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న జై హనుమాన్ టీమ్

ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja sajja) హీరోగా 2024 సంక్రాంతికి వచ్చిన హను మాన్(Hanu Man) సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజైన హను మాన్ 2024లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. హను మాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్(jai hanuman) ను మేకర్స్ అనౌన్స్ చేయగా, ఆ సినిమాలో రిషబ్ శెట్టి(Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
అయితే జై హనుమాన్ గురించి గత కొంతకాలంగా ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. కాగా ఇప్పుడు జై హనుమాన్ నుంచి ఓ స్పెషల్ ట్రీట్ రానున్నట్టు తెలుస్తోంది. జులై 7న రిషబ్ శెట్టి బర్త్ డే సందర్భంగా జై హనుమాన్ నుంచి ఓ స్పెషల్ ట్రీట్ ను వీడియో రూపంలో వదలనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకైతే ఇది ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే.
ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భూషన్ కుమార్(bhushan kumar) సమర్పణలో తెరకెక్కుతున్న జై హనుమాన్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హను మాన్ సినిమాలో హీరోగా నటించిన తేజా సజ్జా కూడా ఓ పాత్ర చేయనున్నాడు. కాంతార(kanthara) సినిమాతో హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రిషబ్, జై హనుమాన్ తో అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించి, తన క్రేజ్ ను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.