Jai Hanuman: జై హనుమాన్ ఈసారి సౌండ్ కాస్త గట్టిగానే
అ!(AWE!) సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా అడుగుపెట్టాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma). మొదటి సినిమాతోనే కుర్రాడిలో విషయముంది అనిపించుకున్న ప్రశాంత్ వర్మ ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. ప్రతీ సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన ప్రశాంత్ వర్మ గతేడాది హను మాన్(Hanu Man) సినిమాతో పెద్ద సంచలనమే సృష్టించాడు.
హను మాన్ సినిమాతో తెలుగు ఆడియన్స్ తో పాటూ పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించి అందరి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. జై హనుమాన్(Jai Hanuman) సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) హనుమాన్ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత భూషణ్ కుమార్(Bhushan Kumar) సమర్పించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే జై హనుమాన్ సౌండ్ ఈసారి దేశ వ్యాప్తంగా మరింత గట్టిగానే ఉంటుందని చెప్పొచ్చు. కాంతార2(Kanthara2) షూటింగ్ పూర్తవగానే రిషబ్ శెట్టి ఫ్రీ అవుతాడు కాబట్టి వెంటనే జై హనుమాన్ సినిమాను మొదలుపెట్టే ఛాన్సుంది.






