Jaat: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన జాట్
క్రాక్(Crack), వీర సింహారెడ్డి(Veera Simhareddy) సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్లు అందుకున్న డైరెక్టర్ ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడి హీరోకు కథ చెప్పి మెప్పించి ఓకే చేయించుకుని సినిమా తీసి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమా హిట్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాణంలో గోపీచంద్ మలినేని(Gopichand Malineni) డైరెక్టర్ గా సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా జాట్(Jaat) అనే సినిమాను తీశాడు.
బాలీవుడ్ కు వెళ్లి సినిమా తీయడమే కాకుండా డెబ్యూ సినిమాతోనే గోపీచంద్ మలినేని మంచి హిట్ ను అందుకున్నాడు. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిన ఈ జాట్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జాట్ సినిమా ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది.
జాట్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. జాట్ ను థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జాట్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తోంది. జాట్ సినిమా జూన్ 5న ఓటీటీలోకి వచ్చే ఛాన్సుందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జాట్ సినిమా కేవలం హిందీ భాషలోనే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.






