Itlu Me Yedhava: ‘ఇట్లు మీ ఎదవ’ అందరికీ కనెక్ట్ అయ్యే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి
 
                                    త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఎదవ (Itlu me yedhava). సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. యూత్ ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా వారికి పాదాభివందనం. ప్రేక్షకులకు నమస్కారం. మేము ఒక మంచి సినిమా చేసాం. అందరూ కష్టపడ్డారు. నేను కష్టపడ్డాను. అందరు కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. భరణి గారు గోపరాజు రమణ గారు దేవి ప్రసాద్ గారు వారిచ్చిన సపోర్టు ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరు కూడా నేను కొత్త వాడినని చూడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులానే నన్ను చూసుకున్నారు. డీవోపీ జగదీష్ గారు సినిమాని అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకులు కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. నిర్మాత బళ్లారి శంకర్ గారు చాలా మంచి వ్యక్తి.పట్నాయక్ గారికి ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరూ మంచి పాత్రలు చేశాం. 100% మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా కథ విన్నాను. నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. త్రినాధ్ డెడికేటెడ్ గా ఫ్యాషన్టెడ్ గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్ సూచించింది కూడా నేనే. కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. ఇది యూత్ అందరికీ తెగ నచ్చుతుంది. యూత్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. సినిమా క్లైమాక్స్ లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను . టెక్నీషియన్స్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
హీరోయిన్ సాహితీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఇది. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది .అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. మా డైరెక్టర్ గారు చాలా క్లియర్ విజన్ తో చేశారు. ఆయన వల్లే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ చేయగలిగాం. మా నిర్మాత శంకర్ గారు చాలా మంచి పర్సన్. మా మీద నమ్మకంతో సినిమా చేశారు. తప్పకుండా ఆయనకి చాలా మంచి విజయం దొరుకుతుందని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
రిషి మాట్లాడుతూ.. సినిమా చూశాను .చాలా అద్భుతంగా ఉంది. ఆర్పి పట్నాయక్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం మేకర్ చేసిన సినిమా లాగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. శ్రీధర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమా ఇది.
డైరెక్టర్ తేజ మర్ని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాకి బోల్డంత డబ్బు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నిర్మాత శంకర్ గారి గురించి ఆడాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.ఆడియన్స్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. త్రినాధ్ మంచి రైటరు మంచి పర్ఫార్మర్ ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. తప్పకుండా ఆయన మంచి ఆయన గొప్ప స్థాయికి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఇది యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది
నిర్మాత బళ్లారి శంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా.పట్నాయక్ గారు మ్యూజిక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు గారికి హీరో శ్రీకాంత్ గారికి నిర్మాత కేఎస్ రామారావు గారికి కృతజ్ఞతలు. ఇది నా ఫస్ట్ సినిమా మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
యాక్టర్ గోపరాజు రమణ మాట్లాడుతూ.. ఇది చాలా క్యాచీ టైటిల్ నిత్యం. అందరూ వాడే టైటిల్. చాలా మంచి కథ. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. తను చాలా ప్రతిభావంతుడు తప్పకుండా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుంది. అందరు కూడా చాలా అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుంది.
యాక్టర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. త్రినాథ్ కథ చెప్తున్నప్పుడే ఈ కథకు ఆయనే హీరో అయితే బాగుంటుందని అనుకున్నాను.కథ పూర్తి అయిన తర్వాత నేనే హీరో అని చెప్పారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నూటికి నూరుపాళ్ళు టాలెంట్ ఉన్న డైరెక్టర్. యాక్టర్ గా కూడా మీరు సినిమా చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.
డీవోపీ జగదీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా అద్భుతమైన జర్నీ ఉంటుంది. ఇందులో హీరో క్యారెక్టర్ తో అందరూ రిలేట్ అవుతారు. డెఫినెట్‌గా ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.
మధుమణి మాట్లాడుతూ.. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా తప్పకుండా అందరూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది
తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. ప్రదీప్ రంగనాథన్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా హీరో డైరెక్టర్ త్రినాథ్ గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఆర్పీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.











 
                                                     
                                                        