వార్3లో మరో స్టార్ హీరో
ప్రస్తుతం యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా అంటే వార్-2 నే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడన్న ఒక్క చిన్న అనౌన్స్మెంట్ తో ఈ సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అసలు హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి వీరిద్దరూ ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న వార్ 2 లో కలిసి నటిస్తున్నారనేది అందరికీ పెద్ద ట్విస్ట్ అయింది.
దానికి తోడు వార్-2 లో ఎన్టీఆర్ విలన్ గా కనిపించనున్నాడని తెలిశాక ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ విలన్ గా చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహలకు కూడా అందడం కష్టం. ఎన్టీఆర్, హృతిక్ కలిసి వెండితెరపై ఢీ పడుతుంటే వేరే లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ అప్పుడే తెగ సంబరపడిపోతున్నాడు.
ఇద్దరు హీరోలు కలిసి చేస్తేనే ఇలా ఉంటే వీరితో మరో స్టార్ హీరో కూడా జాయిన్ అయితే ఆ సినిమా రేంజ్ ఏ లెవల్లో ఉంటుందో ఊహించుకోండి. అవును నిజమే. వార్2 తర్వాత రానున్న సీక్వెల్ వార్3 లో తమిళ స్టార్ హీరో సూర్య నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ టాక్ నిజమైతే మాత్రం పాన్ ఇండియన్ లెవల్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇదే అవుతుంది.













