Kingdom: కింగ్డమ్ ట్రైలర్ పై పెరుగుతున్న ఆసక్తి
గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం కింగ్డమ్(Kingdom) సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫుల్ లెంగ్త్ యాక్షన్ డ్రామాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని కలిగించింది.
దీంతో కింగ్డమ్ ట్రైలర్(Kingdom Trailer) ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి పలు వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కింగ్డమ్ ట్రైలర్ కట్ రెడీ అయిందని, ఆ ట్రైలర్ ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా ఉండబోతుందని యూనిట్ వర్గాలంటున్నాయి.
కాగా జులై 25న కింగ్డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. కింగ్డమ్ ట్రైలర్ లో అదిరిపోయే విజువల్స్ తో పాటూ యాక్షన్, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుని మేకర్స్ దాన్ని కట్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ ను బట్టి చూస్తుంటే ట్రైలర్ తో కింగ్డమ్ సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందంటున్నారు. మరి నిజంగానే విజయ్ ట్రైలర్ తో ఆ రేంజ్ హైప్ ను క్రియేట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది.







