Allu Arjun Atlee: బన్నీ- అట్లీ మూవీలో ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్

పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అని ఎంతగానో ఎదురుచూసిన వారందరిలో ఫుల్ జోష్ ను నింపుతూ అట్లీ(atlee)తో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
అందుకే ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీపై ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడని, ఆ సెకండ్ క్యారెక్టర్ కు సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుందని, ఆ రెండో పాత్ర ను అట్లీ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయడంతో పాటూ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో దీపికా పదుకొణె(deepika padukone) ఓ హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బన్నీ(bunny) కోసం అట్లీ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడని, మాఫియా నేపథ్యంలో ఓ డాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్తున్నారు. సన్ పిక్చర్స్(sun pictures) భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్, రిలీజ్ డేట్ కు సంబంధించిన వివరాలను నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నట్టు డైరెక్టర్ అట్లీ తాజాగా వెల్లడించాడు.