ఇండియన్2 బిజినెస్ అప్పుడే మొదలెట్టేశారుగా
కమల్ హాసన్ ఎంతో గొప్పగా చెప్పుకునే సినిమాల్లో భారతీయుడు ఒకటి. అలాంటి సినిమాకు పాతికేళ్ల తర్వాత ఇండియన్2 అనే టైటిల్ తో సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తరపున సునీల్ నారంగ్, సురేష్ బాబు సొంతం చేసుకున్నారని నెట్టింట వార్తలొస్తున్నాయి.
ఎంతకు కొన్నారనేది బయటకు చెప్పట్లేదు కానీ భారీ మొత్తానికే అని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ కూడా అయిపోతున్నాయంటే సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చారని అర్థం చేసుకోవచ్చు. కోలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం శంకర్ ఈ సినిమా కోసం రెండు మూడు డేట్స్ ను అనుకుంటున్నాడట.
ఏప్రిల్ లో వద్దామనుకుంటే టైమ్ తక్కువగా ఉండటంతో ప్రమోషన్స్ కు టైమ్ సరిపోదేమో అని ఆలోచిస్తున్నారట. కల్కి పోస్ట్‌పోన్ అయితే ఆ డేట్ లో రావడానికి కూడా ఇండియన్ 2 టీమ్ సన్నాహాలు చేస్తోంది. పుష్ప2 వాయిదా పడుతుందనుకోవడం భ్రమే కాబట్టి ఆ డేట్ అనుకున్నా వేస్ట్. ఇవేవీ కాదంటే డిసెంబర్ కు వెళ్లాల్సి వస్తుంది. కానీ డిసెంబర్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా గేమ్ ఛేంజర్ ను కూడా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు చాలా గట్టిగా అనుకుంటుండటంతో భారతీయుడు నవంబర్ లోపే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది. మరి ఇండియన్2 రిలీజ్ డేట్ ను శంకర్ ఎప్పుడు ఫిక్స్ చేస్తాడో చూడాలి.













