భోగిలో యాక్షన్‌కు మించిన ఎమోషన్!
విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్(Sharwanand) ఈసారి ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో తన లక్ ను పరీక్షించుకోనున్నాడు. సంపత్ నంది(Sampath nandi) దర్శకత్వంలో తెరకెక్కిన భోగి(Bhogi) సెన్సార్ అడ్డంకులను అధిగమించి నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లోని ఇంటెన్స్ వయొలెన్స్ సీన్స్ సినిమాపై డిస్కషన్ కు దారితీశాయి. అయితే యాక్షన్‌కు మించిన ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని డైరెక్టర్ సంపత్ నంది వెల్లడించారు.
కథకు అవసరమైన మేరకే ఫైట్ సీన్స్ ను రూపొందించామని, ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడం కోసం అనవసరమైన వయొలెన్స్ ను పెట్టలేదని సంపత్ నంది క్లారిటీ ఇచ్చారు. అన్నాచెల్లెళ్ల బాండింగ్ ఈ సినిమాలో కీలకంగా ఉండనుందని తెలిపారు. క్యారెక్టర్ కు న్యాయం చేసేందుకు శర్వానంద్ ఎంతో శ్రమించారని, ఆయన యాక్టింగ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని డైరెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ బాండింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమా స్పెషాలిటీగా కనిపిస్తోంది.
మరోవైపు భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) అందించిన మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే అన్నాచెల్లెళ్ల బాండింగ్ ను చాటిచెప్పే సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కేకే రాధామోహన్(KK Radhamohan) నిర్మించారు. ఇప్పటివరకు తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకున్న శర్వానంద్, ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాతో మాస్ ఆడియన్స్ కు ఎంతవరకు చేరువవుతారనేది ఆసక్తికరంగా మారింది.







