Dharmendra: బాలీవుడ్ లెజెండరీ హీరో ధర్మేంద్ర కన్నుమూత.. శోక సంద్రంలో సినీ ప్రపంచం
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) శ్వాసకోశ సమస్యలతో సోమవారం తుదిశ్వాస విడవడం సినీ ప్రపంచానికి పెద్ద షాక్‌గా మారింది. ఆయన మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆరు దశాబ్దాల సినిమా జీవితంలో అనేక హిట్లతో కోట్లాది అభిమానులను సంపాదించిన ధర్మేంద్ర, డిసెంబరు 25న విడుదల కానున్న ‘ఇక్కీస్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఆయన చనిపోయినట్లు వచ్చిన పుకార్లను ధర్మేంద్ర స్వయంగా ఖండించినప్పటికీ, ఈసారి వచ్చిన వార్త నిజం కావడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాలీవుడ్ హీరోలు సంతాపం ప్రకటించారు. ధర్మేంద్ర గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని, భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.
సినిమా ఒక బలమైన స్వరాన్ని కోల్పోయింది.. మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాలీవుడ్ హీరోలు సంతాపం ప్రకటించారు. ధర్మేంద్ర గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని, భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.






