Anudeep KV: యాక్టింగ్ ఎందుకు చేస్తున్నానా అనిపిస్తుంది
జాతిరత్నాలు(jathi ratnalu) డైరెక్టర్ అనుదీప్ కెవి(Anudeep kv) దర్శకత్వంలో విశ్వక్ సేన్(Viswaksen), కయాదు లోహర్(kayadhu lohar) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా సినిమా ఫంకీ(Funky). సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా, ఆ ప్రమోషన్స్ లో అనుదీప్ యాక్టివ్ గా పాల్గొంటున్నాడు.
రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన అనుదీప్, ఫంకీ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు. జాతిరత్నాలు మూవీకి ఫంకీ మూవీ చాలా భిన్నంగా ఉంటుందని, తాను గతంలో తీసిన ప్రిన్స్(Prince) మూవీ అనుకున్న ఫలితాన్ని ఆశించకపోవడానికి కారణం స్క్రిప్ట్ కు సరైన సమయం దొరక్కపోవడమేనని, అందుకే ఫంకీకి చాలా ఎక్కువ టైమ్ తీసుకుని అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టు చెప్పాడు అనుదీప్.
ఇక యాక్టింగ్ గురించి మాట్లాడుతూ, తాను కావాలని యాక్టింగ్ లోకి రాలేదని, యాక్టింగ్ చేసే సమయంలో కారవాన్ లో ఉన్నప్పుడు తనకు ఇబ్బందిగా అనిపిస్తుందని, అసలు తానెందుకు ఈ పని చేస్తున్నానా అనిపిస్తుందని అనుదీప్ చెప్పాడు. భవిష్యత్తులో డైరెక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నానని, తర్వాతి మూవీ కోసం లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రాస్తున్నానని చెప్పిన అనుదీప్, వెంకటేష్ కూడా ఓ కథను రెడీ చేస్తున్నట్టు చెప్పాడు.













