Chiranjeeva: “చిరంజీవ” సినిమా ఘనవిజయం సాధించాలి – అనిల్ రావిపూడి
రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ”. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi )ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
రాకెట్ రాఘవ మాట్లాడుతూ – అభితో కలిసి జబర్దస్త్ చాలా ఎపిసోడ్స్ చేశాం. ఆయన ఏ స్కిట్ చేసినా హార్డ్ వర్క్ చేస్తారు, అందరితో టీమ్ వర్క్ చేయిస్తారు. ఈ చిరంజీవ మూవీలో కూడా నాకు అదే కనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు
జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడుతూ – అభి స్కిట్స్ ఎంత కొత్తగా ఉంటాయో ఈ చిరంజీవ మూవీ కూడా అంతే కొత్తగా అనిపిస్తోంది. అభి ఇప్పటికే డైరెక్టర్ కావాల్సినవాడు. బలగం సినిమాతో వేణు అన్న ఎలా పేరు తెచ్చుకున్నాడో అభికి కూడా అలా పేరు రావాలి. అభి మా అందరికీ ఇన్సిపిరేషన్ గా నిలుస్తాడు. అన్నారు.
జబర్దస్త్ హైపర్ ఆది మాట్లాడుతూ – చిరంజీవ చూశాక ఒక మంచి సినిమా అవుతుందని నమ్మకం కలిగింది. ఆహాలో ఈ సినిమా బాగా ఆదరణ పొందాలి. నాకు ఈ రోజు ఉన్న గుర్తింపు, వస్తున్న అవకాశాలు అన్నింటికీ అభి అన్న కారణం. ఆయనతో పాటు రాజ్ తరుణ్ కు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.
ఆహా సీయీవో రవికాంత్ మాట్లాడుతూ – చిరంజీవ సినిమా గురించి మేము మాట్లాడటం కంటే ప్రేక్షకులే చెప్పాలి. మంచి డెప్త్ ఉన్న స్టోరీ ఇది. ఈ సినిమా టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మా ఆహాకు నవంబర్ నెలను చిరంజీవ మూవీతో మొదలుపెడుతున్నాం. దీని తర్వాత మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ ను ఆహాలో మీరు చూడొచ్చు. అన్నారు.
ఆహా కంటెంట్ హెడ్ శ్రావణి మాట్లాడుతూ – ఆహాలో మన లోకల్ కంటెంట్ ను ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్న టైమ్ లో అభి, రాజ్ తరుణ్ వచ్చి చిరంజీవ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ వినగానే ఈ సినిమా చేయాలని అనుకున్నాం. ఈ మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
నటుడు సంజయ్ కృష్ణ మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిరంజీవ మూవీని ఈ నెల 7వ తేదీ నుంచి ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
నటుడు కిరీటి మాట్లాడుతూ – ఉయ్యాల జంపాల మూవీతో నాకు గుర్తింపు వచ్చింది. అందుకు రాజ్ తరుణ్ కారణం. అభి చేసే స్కిట్స్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాను ఆయన తీసిన విధానం ఇంకా ఆకట్టుకుంది. చిరంజీవ సినిమా రాజ్ తరుణ్ కు మరో హిట్ ఇవ్వాలి. అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో నేను చేసిన ఒరేయ్ బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు చిరంజీవ మూవీ ఈ నెల 7న ప్రీమియర్ కాబోతోంది. ఆహా సబ్ స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరుతున్నా. సినిమాకు అందరం కష్టపడతాం. కానీ అభి డైరెక్టర్ గా మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. మంచి హిట్ దక్కించుకునేందుకు అతను అన్ని విధాలా అర్హుడు. ఈ సినిమాలో నాతో పాటు కిరీటి, సంజయ్ కృష్ణ..ఇలా మంచి కోస్టార్స్ నటించారు. వాళ్లందరితో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు.
ప్రొడ్యూసర్ రాహుల్ అవుదొడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా స్క్రిప్ట్ టైమ్ నుంచి మాకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు ఆహా టీమ్. సినిమా కంటెంట్ బాగుందని నమ్మడం వల్లే మా మూవీకి పనిచేసిన టీమ్ అంతా ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హీరో రాజ్ తరుణ్ అందించిన సపోర్ట్ ను మర్చిపోలేను. కొన్నిసార్లు హై ఫీవర్ తో కూడా సెట్ కు వచ్చి షూటింగ్ చేసేవారు. చిరంజీవ మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆహాలో చూడండి. అన్నారు.
డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ – 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నాను. పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ స్ట్రగుల్ లో ఆహా నుంచి శ్రావణి గారికి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను. చిరంజీవ కథ వారికి బాగా నచ్చి మూవీ చేసేందుకు ముందుకొచ్చారు. ఆహా టీమ్ నుంచి మాకు ఎంతో సపోర్ట్ లభించింది. అలాగే మా ప్రొడ్యూసర్స్ రాహుల్, సుహాసినీ గారు కాన్సెప్ట్ ను బాగా నమ్మారు. జబర్దస్త్ చేసేప్పుడు స్కిట్స్ లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాను. ఇప్పుడు చిరంజీవ మూవీలో కూడా హీరోకు ఏజ్ మీటర్ అనే కాన్సెప్ట్ పెట్టి కొత్త ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. సినిమా బాగుంటే మిగతా వారికి చెప్పండి. ఆహాలో చిరంజీవ మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – చిరంజీవ మూవీ కాన్సెప్ట్ గురించి అభి చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అభి నాకు గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమా టైమ్ నుంచి తెలుసు. ఆ సినిమాలో మంచి రోల్ చేశాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ మూవీ తర్వాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. యాక్టర్స్ ను బాగా ఇమిటేట్ చేస్తుంటాడు. కందిరీగ సినిమాకు తెలంగాణ యాసలో డైలాగ్స్ రాసేందుకు అభి హెల్ప్ చేశాడు. అదిరే అభిగా జబర్దస్త్ తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. రాజ్ తరుణ్ కు కూడా ఈ సినిమా కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నా. చిరంజీవ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.







